![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -32లో.. సీతాకాంత్ చెప్పగానే తన ఫ్రెండ్స్ అయిన పోలీసులు మాణిక్యాన్ని తీసుకొని ఒక చోటుకి వస్తారు. ఏదో పార్టీ ఉందని మాణిక్యాన్ని వాళ్ళు తీసుకొని వస్తారు. దాంతో పార్టీ ఎక్కడ అని మాణిక్యం వాళ్ళని అడుగుతాడు. ఇప్పుడు మందు తీసుకొని రావడానికి వెళ్తున్నా అని వాళ్ళు వెటకారంగా మాట్లాడతారు. మాణిక్యం అప్పటికే ఏదో తేడా కొడుతుందని అనుకుంటాడు.
ఆ తర్వాత రామలక్ష్మికి మాణిక్యం మెసేజ్ చేస్తాడు. అది చూసి రామలక్ష్మి తన నాన్న ఉన్న దగ్గరికి బయలుదేరి వెళ్తుంది. మరొకవైపు మాణిక్యాన్ని చూడగానే కోపంతో ఊగిపోతు గదిలో నుండి మాణిక్యం దగ్గరకి బయటకు రాబోతుంటే తన ఫ్రెండ్స్ ఆపి.. వాడేం చెప్తాడో విను ఆవేశపడకని చెప్తారు. మేమ్ పోలీసులం.. నువ్వు చంద్రకాంత్ అనే వ్యక్తిని మోసం చేసి అతని చావుకి కారణం అయ్యావని ఆరోపణలు ఉన్నాయని మాణిక్యాన్ని ఓ పోలీస్ అడుగుతాడు. అంతా అబద్ధం.. నేను మోసం చెయ్యలేదు. అతనే ప్రజలని మోసం చేసి డబ్బులు తీసుకున్నాడని మాణిక్యం చెప్తుంటే కోపంగా సీతాకత్ బయటకు వస్తుంటాడు. అప్పుడే రామలక్ష్మి వచ్చి మీరంతా ఎవరు మా నాన్నని ఎందుకు తీసుకొని వచ్చారని అడుగుతుంది. అది విన్న సీతాకాంత్ షాక్ అవుతు.. ఏంటి ఈ అమ్మాయి వీడి కూతురా? అంటే వీళ్లంతా ప్లాన్ తోనే మా కుటుంబంతో పరిచయం పెంచుకున్నారా అని అనుకుంటాడు. ఇక సీతాకాంత్ కోపంగా మాణిక్యం దగ్గరకి వచ్చి అన్యాయంగా మా నాన్నని మోసం చేసావ్ కదరా అంటూ కొడతాడు. ఎవరు నువ్వు అని సీతాకాంత్ ని మాణిక్యం అడుగుతాడు. నువ్వు మోసం చేసిన చంద్రకాంత్ కొడుకుని అని చెప్పగానే.. అల్లుడు అంటు మాణిక్యం పిలుస్తాడు. ఛీ అలా పిలవకని సీతాకాంత్ అంటాడు. ఇక మాణిక్యం చేసిన మోసాన్ని సీతాకాంత్ చెప్తుంటే రామలక్ష్మి ఏదో చెప్పబోతుంటుంది. నువ్వు మాట్లాడకు నన్ను మోసం చేసి జాబ్ లో జాయిన్ అయ్యి.. మా ఇంట్లో సమాచారం అంతా మీ నాన్నకి ఇస్తున్నావని సీతాకాంత్ అంటాడు.
ఆ తర్వాత మీరు మా కుటుంబాన్ని మోసం చేసారని మా నాన్న మాకు చెప్తుంటాడని రామలక్ష్మి అనగానే.. అలా చెప్పుకుంటున్నావా మీ నాన్న ఏ తప్పు చెయ్యలేదంటే ఒక ఊరిలో స్థిరంగా ఎందుకు ఉండడం లేదు.. ఎందుకు తప్పించుకుని తిరుగుతున్నాడని సీతాకాంత్ అంటాడు. వీళ్ళతో మాట్లాడాలి.. మీరు బయటకు వెళ్ళండని తన ఫ్రెండ్స్ ని సీతాకాంత్ బయటకు పంపిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |